Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Main News ట్రేడ్ మార్క్ గుర్తింపు పొందిన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల

ట్రేడ్ మార్క్ గుర్తింపు పొందిన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల

by Rama
ట్రేడ్ మార్క్ గుర్తింపు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల

దక్షిణ భారతదేశంలో ట్రేడ్‌మార్క్‌ పొందిన తొలి భవనంగా ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల. భాగ్యనగరం చరిత్రలో అంతర్భాగమైన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం అరుదైన గుర్తింపును దక్కించుకుంది. 1939లో నిర్మించిన ఈ భవనం జాతీయ స్థాయి మేథో సంపత్తి హక్కుల పరిరక్షణ విభాగంలో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ పొందనుంది. మన దేశంలో ట్రేడ్ మార్క్ గుర్తింపు ఇప్పటి వరకు ముంబయిలోని హోటల్ తాజ్ మహల్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనాలకు మాత్రమే ఉండగా.. దక్షిణ భారతదేశంలో ట్రేడ్ మార్క్ పొందిన తొలి భవనంగా ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనానికి గుర్తింపు లభించనుంది. ట్రేడ్ మార్క్ వచ్చాక ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం డిజైన్ ను వ్యక్తులు గానీ.. సంస్థలు గానీ వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు వీలుండదు. టీ కప్పులు, మగ్గులు, బహుమతులపై ఆర్ట్స్ కళాశాల భవనం ఫొటోలను ముద్రించే వీలు ఉండదు. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ మరో నాలుగైదు నెలల్లో రానుందని వర్సిటీ అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై విశ్వవిద్యాలయం అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019365
Total views : 90557

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.