దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షాల రాకతో ఒకవైపు వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుండగా, మరోవైపు అనేక రోగాల బారిన పడే ప్రమాదం కూడా పెరిగింది. ఈ క్రమంలో మరోసారి జికా వైరస్ కలకలం .. రేపింది. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఈ వైరస్ సోకిన రెండు కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ప్రారంభంలో ముంబైలో కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని వేగంగా పెంచుతుంది. జికా వైరస్ కోరలు చాచుతోంది. మహారాష్ట్రలోని పుణెలో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఓ వైద్యుడు, ఆయన కుమార్తెకు జికా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని పుణె కార్పొరేషన్ అధికారులు తెలిపారు. నగరంలోని ఎరండ్ వానే ప్రాంతానికి చెందిన ఓ వైద్యుడికి జ్వరంతోపాటు శరీరంపై దద్దుర్లు వచ్చాయి.
దీంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన రక్తనమూనాలను నగరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. జూన్ 21న ఆయనకు జికా వైరస్ పాజిటివ్ గా వచ్చినట్లు నిర్ధారించారు అధికారులు. తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేశారు. వైద్యుడి కుమార్తెకు కూడా వైరస్ సోకినట్లు పేర్కొన్నారు. రెండు కేసులు నమోదు అవ్వడంతో అప్రమత్తమైన వైద్య అధికారులు ఆ ప్రాంతంలో వైరస్ వ్యాప్తి నివారణ చర్యలను చేపట్టారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి…
- పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్‌యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది…
- విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా… ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, బోటు, వల పూర్తిగా…
- రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా.రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్.. ప్రస్తుతం…
- డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”.ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”. ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ను ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. అజాతపర్వం ముగిసింది, ది రెబలియన్ ప్రారంభమైంది అంటూ డిసెంబర్ 3న ఫౌజీ సినిమాను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 212285