Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Telangana విపక్ష నేతలపై విజయశాంతి కౌంటర్

విపక్ష నేతలపై విజయశాంతి కౌంటర్

by Satya
Vijayashanti

తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. కొత్త మంత్రులు ఆయా శాఖలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలకు మించి ఉండదంటూ విపక్ష నేతలు విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యంగా హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకుని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు పరామర్శించిన నేపథ్యంలో ఈ తరహా విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఈ విమర్శలకు కాంగ్రెస్ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. సర్జరీ చేయించుకుని హాస్పిటల్‌లో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి ఓదార్పు ఇచ్చారని, దీనిపై కూడా కొంతమంది బీఆర్ఎస్ ముఖ్యు నేతలు వ్యతిరేక వ్యాఖ్యలు చెయ్యడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవీయ స్పందనకు రాజకీయాన్ని కలపడం నేటి బీఆర్‌ఎస్‌కు అవసరమేమో కానీ కాంగ్రెస్‌కు ప్రభుత్వానికి అవసరం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం కూలుతుందంటూ బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రకటనలను కేసీఆర్ తప్పక ఖండించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: