Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

by Satya
YV Subbareddy

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించి పదేళ్లు కావస్తోంది. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఇప్పుడా గడువు కూడా పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో, వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర్రానికి మేలు జరగాలంటే హైదరాబాద్ నగరం మరి కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది తమ ఆలోచన అని పేర్కొన్నారు. విశాఖ రాజధాని కార్యసాధన పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగితేనే బాగుంటుందని వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ముగిశాక సీఎం, వైసీపీ నాయకత్వం దీనిపై చర్చిస్తారని వెల్లడించారు. రాజధాని కట్టకుండా ఐదేళ్ల పాటు తాత్కాలికం పేరుతో టీడీపీ కాలయాపన చేసిందని విమర్శించారు.

Read Also..

మరిన్నితాజావార్తలకోసంఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: