70
పెద్దపల్లి జిల్లా: రామగుండం కార్పోరేషన్ 10 వ డివిజన్ బీఅర్ఎస్ కార్పోరేటర్ అడ్డాల.గట్టయ్య వీరంగం సృష్టించారు.
గోదావరిఖని చౌరస్తా లో తన వాహనానికి అడ్డంగా వచ్చారంటూ ఓ కారు డ్రైవరుపై దాడి చేశాడు.
దీంతొ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు సదురు కార్పోరేటర్ పై ప్రతి దాడికి దిగారు. ఈ సంఘటనతో గోదావరిఖని ప్రదాన చౌరస్తా కొద్ది సేపు రణరణంగంగా మారింది.మేము ప్రయాణిస్తున్న కారు వారి కారుకు డీ కొట్టలేదని తమ డ్రైవరు పై కార్పోరేటర్ గట్టయ్య అకారణంగా దాడి చేశాడంటూ కారులో ప్రయాణికులు వాపోయారు.
అయితే తనపై గుర్తు తెలియని వ్యక్తులు అకారణం దాడి చేశారంటు కార్పోరెటర్ గట్టయ్య గోదావరిఖని వన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం..