Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Latest News సీఎం కేసీఆర్ గజ్వేల్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం

సీఎం కేసీఆర్ గజ్వేల్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం

by Rama
KCR

సీఎం కేసీఆర్ ఇవాళ సొంత నియోజకవర్గం గజ్వేల్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతోందో తమ అంచనాలు వెల్లడించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తనకు తెలిసినంతవరకు బీఆర్ఎస్ కు 95 నుంచి 105 స్థానాలు వస్తాయని తెలిపారు. అందులో ఎలాంటి సందేహం లేదని, ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. ఓ కారణంతోనే తాను ఈసారి కామారెడ్డిలో పోటీ చేస్తున్నానని, అయితే గజ్వేల్ ను వదిలిపెట్టి వెళ్లబోనని స్పష్టం చేశారు. రాష్ట్రానికి తలమానికంగా ఉండేలా గజ్వేల్ ను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ఉద్ఘాటించారు. కాగా, గజ్వేల్ లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఓ సెంటిమెంటుగా వస్తోందని సీఎం కేసీఆర్ వివరించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: