Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Latest News సన్నాసులు కేసీఆర్, కేటీఆర్ లపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు!

సన్నాసులు కేసీఆర్, కేటీఆర్ లపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు!

by
sharmila

ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి తండ్రీకొడుకులకు మతి భ్రమించినట్టుందంటూ కేసీఆర్, కేటీఆర్ లపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు అధికారమిస్తే 65 వేల ఉద్యోగాలు ఇయ్యలేనోడికి, 12 లక్షల దరఖాస్తులకు లక్ష ఇళ్లు కట్టడం చేతకానోడికి మళ్లీ అధికారమిస్తే వరద పారినట్టు వడ్లు పండిస్తాడట అని విమర్శించారు. చెప్పేటోనికి వినేటోడు లోకువ అన్నట్లుంది కేసీఆర్ తీరు అని అన్నారు.కేజీ టూ పీజీ అని చెప్పి విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించారన్నారు. నిరుద్యోగుల శవాల మీద ఇంతకాలం అధికారంలో కూర్చున్న మీకు ఓట్లు అడగడానికి ఇజ్జత్ ఉండాలని అన్నారు. బంగారు తెలంగాణలో ఇంటిల్లిపాది కొలువులు అనుభవించి, అందిన కాడికి దోచుకొని, మళ్లీ గెలిస్తే ఇండ్లిస్తాం, ఉద్యోగాలిస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం అనే వింత మాటలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని వ్యాఖ్యానించారు.

Advertisements

You may also like

Our Visitor

026133
Total views : 149955

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.