జమిలి ఎన్నికలు లేదా వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే ఆలోచనకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మద్దతు తెలిపారు. ఇది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా లబ్ధి చేకూరుతుందన్నారు. దేశానికి మేలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు మద్దతివ్వాలని కోరారు. ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశం అయినందున ఏ పార్టీకైనా దీనివల్ల ప్రయోజనం ఉంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించి, సూచనలను పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి జమిలి ఎన్నికల ద్వారా ఆదా అయ్యే ఖర్చును అభివృద్ధి పనులకు వినియోగించవచ్చు. అది ప్రజలకు మేలు కలిగిస్తుందన్నారు.
జమిలి ఎన్నికలతో దేశానికి మేలు
29
previous post