Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Telangana రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి కానున్న కేసీఆర్‌

రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి కానున్న కేసీఆర్‌

by Satya
KCR

తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కోలుకుంటున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. వైద్యులు వాకర్‌ సాయంతో ఆయనను నడిపించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నదని చెప్పారు. చాలా వేగంగానే రికవరీ అవుతున్నారని అన్నారు. ఆర్థోపెడిక్‌, ఫిజియోథెరపీ వైద్యుల పర్యవేక్షనలో వాకర్‌ సాయంతో నడిపించే ప్రయత్నం చేయగా, ఆయన శరీరం బాగా స్పందించిందని తెలిపారు. బెడ్‌ బయటకు వచ్చి కూర్చున్నారని వెల్లడించారు. సాధారణంగా తుంటి కీలు మార్పిడి జరిగిన పేషెంట్‌ను 12 గంటల్లోపు నడిపించే ప్రయత్నం చేస్తామని, దీన్ని మెడికల్‌ పరిభాషలో ‘మొబిలైజేషన్‌ స్టార్ట్‌’ అంటారని వివరించారు. కేసీఆర్‌కు ఆపరేషన్‌ నొప్పి తగ్గి, సాధారణ నొప్పి మాత్రమే ఉన్నదని, ఆయన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని తెలిపారు. సాధారణ ఆహారమే తీసుకుంటున్నారని పేర్కొన్నారు. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు కూడా చేయిస్తున్నామని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందని అన్నారు. శరీరం సహకరిస్తే మరో రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపారు. కనీసం 6-8 వారాలపాటు విశ్రాంతి అవసరం ఉంటుందని వివరించారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: