Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Health జామ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

by Satya
guava fruit

జామ పండ్లలో విటమిన్ బి12, బి6 ఉంటాయి. ఇవి మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ఆహారంలో జామకాయలను చేర్చుకోవడం వల్ల పై ప్రయోజనాలు పొందవచ్చు. నొప్పి, మంటను తగ్గిస్తుంది. జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది శరీరంలో మంటను, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా జామ పండ్లు తింటుంటే ఈ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. జామపండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. చలికాలంలో జామ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే జలుబు, జ్వరం, తలనొప్పి వంటి సీజనల్ సమస్యలు పరిష్కారం అవుతాయి. జామకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారు, బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నవారు జామకాయలు తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. జామపండ్లలో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపుకు ఎంతో ముఖ్యమైనది. జామపండు తినడం వల్ల కళ్లలో మచ్చలు, కంటి చూపు బలహీన పడటం, కళ్లు అలసిపోవడం వంటి సమస్యలే కాకుండా ఇతర కంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జామ పండ్లలో విటమిన్-సి సమృద్దిగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, వృద్దాప్యాన్ని నెమ్మది చేయడంలో సహాయపడతాయి. జామపండ్లు తరచుగా తినే వారు యవ్వనంగా ఉంటారు. జామపండులో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. జీర్ణాశయంలో పేగుల కదలికను మెరుగ్గా ఉంచి ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది. కాల్షియం బలమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరం. జామకాయ లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మార్చడమే కాకుండా బోలు ఎముకల వ్యాధిని, ఇతర ఎముకలకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014109
Total views : 79012

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.