Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Main News అక్షర సూరీడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి…

అక్షర సూరీడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి…

by Prakash
Akshara Surya Alishetty Prabhakar Jayanti and Vardhanthi

జగిత్యాల జిల్లాలో అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి మరియు వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం జగిత్యాల పట్టణంలోని స్థానిక అంగడి బజార్ వద్ద ఉన్న అలిశెట్టి ప్రభాకర్ విగ్రహానికి BRS ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ అలిశెట్టి ప్రభాకర్ కవితలు అందరికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కవితా రచయితలో ముఖ్యులుగా అలిశెట్టి ప్రభాకర్ గారు ఉంటారని అన్నారు. వీరి కవితలు సమాజానికి మేలు చేసేవిగా అలాగే వారిని ఆలోచింపజేసే విధంగా ఉండేవని ఆయన అన్నారు. వీరి కవితలకు ప్రభావితమైన ప్రజలు మంచి మార్గంలో నడుచుకొని పలువురికి మార్గదర్శకాలుగా ఉన్నారని అన్నారు. అలిశెట్టి ప్రభాకర్ అక్షర సూర్యుడు గా అతను రాసిన కవితలు చాలామందిని ప్రభావితం చేశాయని అదే విధంగా అతను తీసిన ఫోటోలు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాయని తెలియజేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: