Thursday, October 15, 2026
News Navigation
Thursday, October 15, 2026
News Navigation

Breaking

Thursday, October 15, 2026
Home Andhra PradeshWest Godavari కబ్జాకు గురౌతున్న కామన్ సైట్..

కబ్జాకు గురౌతున్న కామన్ సైట్..

by Rama
Appal Naidu

ఏలూరులోని స్థానిక 15 వ డివిజన్ లోని ఆముదాల అప్పల స్వామి కాలనీ లో కబ్జా కు గురౌతున్న కామన్ సైట్ ని ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లో కాలనీకి సంబంధించి ప్రజల అవసరార్థం మార్కెట్ కానీ, కళ్యాణ మండపం కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించేందుకు రెండు ఎకరాలు కేటాయించడం జరిగిందని, అది కొంతమంది బయట వ్యక్తులు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని, ఎవరి చేతుల్లో కూడా ఆక్రమణకు గురవకుండా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి, తగు చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకొని వస్తామని, ఆక్రమణకు గురవుతున్న ఈ స్థలాన్ని, అందరికీ ఉపయోగపడేలా జనసేన పార్టీ పేదల పక్షాన ఉంటుందని తెలియజేశారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ తగు చర్యలు తీసుకోని పక్షంలో జనసేన ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: