Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home National బలపరీక్షలో నెగ్గిన చంపయ్ సోరెన్ ప్రభుత్వం

బలపరీక్షలో నెగ్గిన చంపయ్ సోరెన్ ప్రభుత్వం

by Satya
Champay Soren

జార్ఖండ్ లో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. బలపరీక్షలో చంపయ్ సోరెన్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ ప్రభుత్వం 47 ఓట్లను సాధించింది. వ్యతిరేకంగా 29 ఓట్లు పోలయ్యాయి. బలపరీక్షకు వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీలలో బీజేపీ, ఏజేఎస్‌యూ ఉన్నాయి. బలపరీక్షకు అనుకూలంగా 29 మంది జేఎంఎం, 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆర్జేడీ, సీపీఐ -ఎంఎల్ నుంచి ఒక్కో ఎమ్మెల్యే ఓటు వేశారు. మొత్తం 47 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. బలపరీక్ష నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు హేమంత్ సోరెన్‌ను ఈడీ అసెంబ్లీకి తీసుకువచ్చింది. అలాగే, జేఎంఎం ఎమ్మెల్యేలను నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి రాంచీకి తరలించారు. బలపరీక్ష సమయంలో ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014835
Total views : 81116

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.