Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Main News భగీరథ పంప్ హౌస్ ను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ…

భగీరథ పంప్ హౌస్ ను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ…

by Prakash
భగీరథ పంప్ హౌస్, Bhagiratha Pump House

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద గల మిషన్ భగీరథ పంప్ హౌస్ ను పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పరిశీలించారు. పాలేరు రిజర్వాయర్ అడుగంటడం తో ఇటీవల నాగార్జున సాగర్ నుంచి పాలేరు జలాశయానికి అధికారులు నీటిని విడుదల చేశారు. పాలేరు నుంచే సూర్యాపేట, మహబూబ్ బాద్, ఉమ్మడి ఖమ్మం, జిల్లాలకు త్రాగునీటిని అందిస్తున్నారు. ఈ క్రమంలో రిజర్వాయర్ లో తగినంత నీరు లేకపోవడంతో త్రాగునీటి కోసం సాగర్ జలాలతో నింపారు. మరో వైపు పాలేరు పాత కాలువ కింద పంటలు సాగు చేసిన రైతులు సాగునీరు ఇవ్వాలని పలుమార్లు అధికారులను కోరారు. దీంతో పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పాలేరు రిజర్వాయర్ వద్ద ఉన్న మిషన్ భగీరథ పంప్ హౌజ్ ను పరిశీలించి, అనంతరం జీళ్ళ చెరువు లో అధికారుల తో త్రాగునీటి పై సమావేశం ఏర్పాటు చేశారు. వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. సాగర్ జలాశయం లో నీరు తక్కువగా ఉండటం తో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు.

Read Also…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: