Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh టిడిపి జనసేన, సిఐటియు నాయకుల రాస్తారోకో…

టిడిపి జనసేన, సిఐటియు నాయకుల రాస్తారోకో…

by Prakash
TDP Janasena and CITU leaders wrote
Siddam Sabha :

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో ప్రోగ్రాం కవర్ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి, టీవీ5 విలేకరులపై వైసీపీ గుండాలు అతి పాశవికంగా, క్రూరంగా, రాక్షసంగా వారిపై భౌతికంగా దాడి చేయడం జగన్ ఆటవిక పాలనకు నిదర్శనమన్నారు. జగన్ నిర్వహించిన సిద్ధం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకోపోయి ప్రజలను నట్టేట ముంచడానికి, సిద్ధం సభ నిర్వహించాడా! అని ఎద్దేవా చేశారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీ కృష్ణ పై వైసీపీ గూండాలు చేసిన దాడిలో ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం గుండెలను కలిసివేస్తోందని జనసేన పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ పత్తి చంద్రశేఖర్, టిడిపి మైనార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షబ్బీర్, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబుల్ రెడ్డి, సిఐటియు డివిజన్ కార్యదర్శి లక్ష్మీనారాయణలు ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరులపై విచక్షణారహితంగా దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి
వినతిపత్రం సమర్పించారు.

Advertisements

You may also like

Our Visitor

013979
Total views : 78762

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.