Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra PradeshKarnool శ్రీశైలం ఆలయానికి బంగారు, వెండి సామాగ్రి విరాళం

శ్రీశైలం ఆలయానికి బంగారు, వెండి సామాగ్రి విరాళం

by Rama
Srisailam Temple

శ్రీశైలం ఆలయం (Srisailam Temple):

నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి అమెరికాకు చెందిన కొత్తపల్లి సునీల్ దత్, కుటుంబసభ్యులు బంగారం, వెండి సామాగ్రిని విరాళంగా అందజేశారు. విరాళంగా అందించిన వాటిలో 28 గ్రాముల 300 మిల్లీ గ్రాముల బరువుగల 2 బంగారు బాషికాలు, 5 గ్రాముల బరువుగల బంగారు కంకణం ఉన్నాయి. అదేవిధంగా 1 కేజీ 25 గ్రాముల బరువుతో ఒక వెండి పళ్ళెం, 865 గ్రాముల బరువు గల మరో వెండి పళ్ళెం, 550 గ్రాముల బరువుగల వెండి నాగహారతి, 290 గ్రాముల బరువుగల వెండి శక్తి ఆయుధం, 420 గ్రాముల బరువుగల కుక్కుటధ్వజం, 750 గ్రాముల బరువు 5 వెండి గిన్నెలు, 920 గ్రాముల బరువు గంధాక్షత గిన్నె, 190 గ్రాముల బరువుగల వెండి కమండలాన్ని (చిన్నది) 300 గ్రాముల బరువుగల కమండలాన్ని (పెద్దది) దేవస్థానానికి విరాళంగా అందజేశారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

అదేవిధంగా వీరితోపాటు మరో విరాళ దాతలైన నంద్యాలకు చెందిన కౌలురి సింధూర కూడా వెండి వస్తువులను సమర్పించారు. వీటిలో 810 గ్రాముల బరువుగల వెండిపళ్ళెం, 350 గ్రాముల బరువుగల వెండిపళ్లెం, 615 గ్రాముల బరువుగల 3 వెండి చెంబులను విరాళంగా అందజేశారు. ఇరువురు దాతలు అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు మార్కండేయశాస్త్రి స్థానాచార్యులు పూర్ణానందం, అమ్మవారి ఆలయ అధికారులకు బంగారు, వెండి వస్తువులను అందజేశారు. అనంతరం బంగారం, వెండి అందజేసిన దాతలకు శ్రీస్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు.

ఇది చదవండి: కిలారి వెంకట రోశయ్యకు పరువునష్టం నోటీసు


అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. …
పవన్ కళ్యాణ్‌పై జడ శ్రవణ్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఫిర్యాదు.
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో రాజకీయ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. జనసేన పార్టీ నాయకులు …
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యువతికి ఎమ్మెల్యే ప్రశంసలు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంగవైకల్య యువతి సుంకోజు శివాని సామాజిక సేవపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

039084
Total views : 194242

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: