Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh తాడేపల్లిగూడెంలో టీడీపీ – జనసేన ఉమ్మడి సభ

తాడేపల్లిగూడెంలో టీడీపీ – జనసేన ఉమ్మడి సభ

by Satya
TDP-JanaSena


టీడీపీ – జనసేన ఉమ్మడిగా నిర్వహించబోతున్న తొలి సభకు తాడేపల్లిగూడెం వేదికగా భారీ ఏర్పాట్లు చేశారు. 6 లక్షల మంది ఈసభకు హజరవుతారనే అంచనాతో సభా ప్రాంగణాన్ని ఇరు పార్టీలు కలసి ముస్తాబు చేశారు. ఈ సభకు తెలుగు జన విజయ కేతనం జెండా అనే పేరు పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు వేదికపై నుంచి నాయకులకు, క్యాడర్కు దిశానిర్ధేశం చేయబోతున్నారు.

తాడేపల్లిగూడెం వేదికగా నిర్వహించబోతున్న ఈసభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు మరో 500 మంది నాయకులు వేదికను పంచుకోబోతున్నారు. సభా ప్రాంగణం చుట్టు భారీ ఎల్ఈడీలు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల శంఖారావాన్ని ఇరు పార్టీల అధినేతలు ఇదే వేదికపై నుంచి పూరించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా విజయం సాధించడమే లక్ష్యంగా క్యాడర్ ఏవిధంగా పనిచేయాలి టిక్కెట్ల కేటాయింపు తర్వాత ఇరు పార్టీల ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేయాలనే విధంగా అధినేతలు క్యాడర్‌కు దిశానిర్ధేశం చేయబోతున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఇది చదవండి: ఏపీలో రైతులకు శుభవార్త ..!


చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే …
పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
22ఏపై బీజేపీ దీక్షలు.
భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: