Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh సీఎం జగన్, మిథున్ రెడ్డి సహకారంతో టిటిడి కళ్యాణ మండపం…

సీఎం జగన్, మిథున్ రెడ్డి సహకారంతో టిటిడి కళ్యాణ మండపం…

by Prakash
TTD Kalyana Mandapam in collaboration with CM Jagan and Mithun Reddy...

అన్నమయ్య జిల్లా రాయచోటి చిత్తూరు రోడ్డు నందు రు . 3 కోట్ల 85 లక్షల నిధులతో నిర్మించిన టిటిడి కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ముందుగా కంట్రాక్టర్ కేతంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అక్కడ టిటిడి అధికారులు తో కలిసి శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కళ్యాణమండపం ను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడతూ 15 రోజుల్లో ఈ కళ్యాణమండపం అందరికి అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక్కసారే జరుగుతుందని ఎంతో మంది ఎన్ని ఆశలతో వివాహం చేసుకోవాలని కోరుకొంటారన్నారు. అటువంటి వారి కోసం టిటిడి వారు తక్కువ ఖర్చులతో వివాహం చేసుకునేలా సౌలభ్యాన్ని కల్పించిన టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి , ఈ ఓ ధర్మా రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష, అన్నమయ్య జిల్లా వైసిపి విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, ప్రముఖ వైద్యులు బయా రెడ్డి, మాజీ డి సి సి చైర్మన్ ఆవుల విష్ణు వర్ధన రెడ్డి, చిదంబర్ రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

019442
Total views : 90722

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.