Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా..!

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా..!

by Satya
Tamilisai

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళిసై(Tamilisai) రాజీనామా…

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. ఈ రోజు ఉదయం తమిళిసై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈమేరకు తెలంగాణ గవర్నర్ ఆఫీసు నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) నేపథ్యంలో తమిళిసై రాజీనామా సంచలనంగా మారింది. లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) బరిలో తమిళిసై నిలబడతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, అలాంటిదేమీ లేదని గతంలో స్పష్టం చేసిన తమిళిసై.. ప్రస్తుతం తన పదవికి రాజీనామా చేయడంతో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. తమిళనాడు నుంచి తమిళిసై లోక్ సభ బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. తమిళిసై నాడార్ సామాజిక వర్గానికి చెందిన లీడర్.. దీంతో నాడార్ ల ప్రభావం ఎక్కువగా ఉన్న చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి తమిళిసై పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: బీజేపీ విజయ సంకల్ప సభకు సర్వం సిద్ధం…


వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.
ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం …
ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు. గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ …
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లెస్ కేబినెట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026338
Total views : 150258

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.