Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి..

ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి..

by Rama
CM Jagan

వైఎస్ఆర్ ఆసరా పథకం (YSR Asara Scheme) ద్వారా రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా లబ్ది పొందారని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. బస్సు యాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలోని ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్షత లేదన్నారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93 శాతం మంది లబ్ది పొందారని వివరించారు. ఏ పార్టీ అని చూడకుండా పథకాలు అందిస్తున్నామన్నారు. నా కంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు.. నా కంటే ముందు ఓ 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేశారని చంద్రబాబును ఉద్దేశిస్తూ అన్నారు. వయస్సులో నేను చాలా చిన్నోడినని.. ఇంత చిన్నోడు చేసిన పనులు 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఏనాడైనా చేశాడా అని ప్రశ్నించారు. వయస్సులో చిన్నోడినైనా రాష్ట్రం కోసం పని చేశానని జగన్ తెలిపారు.

ఇది చదవండి: కేటీఆర్‌పై కేసు నమోదు..


త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.
త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ నేత …
అమరావతిలో 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం.
అమరావతిలో జిల్లా కలెక్టర్ల 8వ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ …
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.
తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: