Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh నేడు నుంచి చంద్రబాబు రెండో విడత షెడ్యూల్‌..!

నేడు నుంచి చంద్రబాబు రెండో విడత షెడ్యూల్‌..!

by Satya
Chandrababu

నేడు నుంచి ఐదు రోజుల పాటు చంద్రబాబు(Chandrababu) పలు జిల్లాల్లో పర్యటన..

టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం పర్యటనలకు రెండో విడత షెడ్యూల్‌ ఖరారైంది. నేడు నుంచి ఐదు రోజుల పాటు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నేడు అమలాపురం, రాజమండ్రి, నరసాపురం పార్లమెంట్ పరిధిలో చంద్రబాబు పర్యటిస్తారు. ఇక, రావులపాలెం, రామచంద్రపురంలో టీడీపీ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభ(Public meeting)ల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ బహిరంగ సభలకు భారీ ఎత్తున ప్రజలను పార్టీ నేతలు సమీకరిస్తున్నారు.

ఇది చదవండి: కన్నతల్లి గొంతు కోసిన కసాయి కొడుకు…

అలాగే, రేపు కొవ్వూరు, గోపాలపురంలో చంద్రబాబు రోడ్‌షోలో పాల్గొంటారు. ఇక, ఏప్రిల్ 5వ తేదీన నరసాపురం, పాలకొల్లు, 6న పెదకూరపాడు, సత్తెనపల్లి, 7న పామర్రు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే, ప్రతి రోజు సాయంత్రం 4 గంటలకు తొలి సమావేశం నిర్వహించిన తర్వాత సాయంత్రం 6 గంటలకు రెండో సమావేశం నిర్వహించేలా చంద్రబాబు ప్రణాళిక రూపొందించారు. తొలి విడతలో 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్‌ షోల్లో నిర్వహించిన చంద్రబాబు రెండో విడత యాత్రను నేటి నుంచి కొనసాగించనున్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు …
వైభవంగా గోదావరి పుష్కరాలు.
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: