Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Telangana కాంగ్రెస్ పార్టీ మూడు పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన..

కాంగ్రెస్ పార్టీ మూడు పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన..

by Satya
Congress party announces candidates for three pending seats

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)కు మరికొన్ని గంటల్లో గడువు ముగుస్తుందనగా కాంగ్రెస్ పార్టీ(Congress party) మూడు పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఖమ్మం(Khammam) నుంచి రామసహాయం రఘురామ్‌రెడ్డి(Raghuram Reddy), కరీంనగర్(Karimnagar) నుంచి వెలిచాల రాజేందర్‌రావు(Rajender Rao), హైదరాబాద్(Hyderabad) నుంచి సమీర్ వలీ ఉల్లా ఖాన్ పోటీ చేయనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) ప్రకటించారు. ఇప్పటికే ఈ ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ నుంచి బీ-ఫామ్ అందుకుని రిటర్నింగ్ ఆఫీసర్‌కు సమర్పించడమే మిగిలింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఏఐసీసీ తెర దించింది. ఊహించినట్లుగానే ఖమ్మం స్థానానికి రఘురామ్‌రెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్‌రావు పేర్లు ఖరారయ్యాయి. ఈ రెండు స్థానాల్లో సామాజిక సమీకరణాలకు ప్రత్యేకత ఉన్న పరిస్థితుల్లో ఏఐసీసీ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

ఇది చదవండి: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఈ ముగ్గురి పేర్లను ప్రకటించడంతో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లయింది. నామినేషన్ల గడువు గురువారంతో ముగుస్తున్నందున ఇక ప్రచారం మొదలుపెట్టడమే తరువాయి. ఇప్పటివరకు ఈ స్థానాల్లో అభ్యర్థులెవరో తెలియకపోవడంతో ప్రచారం లాంఛనంగా ప్రారంభం కాలేదు. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరావు, మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లను దాఖలు చేసినా ఇప్పుడు లాంఛనంగా రఘురామ్‌రెడ్డి పేరును ఖరారు చేయడంతో వారు బరి నుంచి తప్పుకోవడం అనివార్యంగా మారింది. కరీంనగర్‌లో సైతం టికెట్ ఆశించిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కానీ అక్కడ రాజేందర్‌రావును ఏఐసీసీ ఫైనల్ చేయడంతో ప్రవీణ్ రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోనున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
    నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్‌ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా…
  • సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
    ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
  • వికారాబాద్‌ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.
    వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున జరుగుతున్న గంజాయి సాగు కలకలం రేపింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆశ్రమంలో అక్రమంగా గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు.యాలాల మండలం గోవిందరావుపేట గ్రామ శివారులో హైదరాబాద్ బోరబండకు చెందిన పప్పులాల్ పది ఎకరాల భూమిని…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

042280
Total views : 223735

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: