తెలంగాణ(Telangana)లో లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనుంది బీజేపీ(BJP). ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేతలు తెలంగాణ బాట పట్టనున్నారు. తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణ పర్యటనకు రానున్నారు. నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు అమిత్ షా. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి సిద్ధిపేటకు వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2 గంటల తర్వాత తిరిగి భువనేశ్వర్ వెళ్లనున్నారు అమిత్ షా.
ఇది చదవండి: ఇంటర్ ఫలితాలలో “అల్ఫోర్స్” చారిత్రాత్మక విజయం…
ఈ బహిరంగ సభకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి అభయ్ పాటిల్, మెదక్ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్ రావుతో పాటు పలువురు నేతలు హజరవుతారు. అమిత్ షా సభను తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమిత్‌షా రాకతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని భావిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత… అమిత్ షా తొలిసారి తెలంగాణ పర్యటనకు రానుండటంతో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. సభా ప్రాంగణాన్ని భారీ కటౌట్లతో నింపనున్నారు. అలాగే పెద్ద ఎత్తున జనసమీకరణకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.ఎన్నికల కమిషన్ నిర్ణయాలు పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో సమిష్టి నిర్ణయాలు, ఓటర్ల జాబితాల విషయంలో పూర్తి పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌లో అంతర్గత అభిప్రాయ భేదాలపై ఇటీవల వచ్చిన నివేదికల…
- కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్రావు.తాను క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లపై ఆధారాలతో క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు విచారణకు స్వీకరించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్…
- మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాల ప్రారంభం.ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు.సింగరేణి సీఎస్‌ఆర్ నిధులు రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన కంటైనర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి ప్రారంభించారు.జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావుతో కలిసి విద్యార్థులతో మాట్లాడిన సీతక్క..…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి