Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra PradeshChittoor తిరుపతిలో రాజకీయ ప్రచారాల హై టెన్షన్..

తిరుపతిలో రాజకీయ ప్రచారాల హై టెన్షన్..

by Rama
Bhumana Karunakar Reddy

తిరుపతిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రోజురోజుకీ హై టెన్షన్ వాతావరణంలో ప్రచారాలు జరుగుతున్నాయి. తిరుపతిలో వైసిపికి, కూటమి అభ్యర్థి మధ్య రోజురోజుకీ వివాదం ముదురుతుంది. నిన్న జరిగిన ఘటనపై కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆరని శ్రీనివాసులు వ్యవహార శైలిపై టిటిడి చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుది హత్యా రాజకీయాల నేపథ్యం ఉన్న వ్యక్తి అని,.. ఇక్కడ గుండాగిరితో రాజకీయాలు చేయాలను కుంటే తస్మాత్ జాగ్రత్త ఆరణి శ్రీనివాసులు అంటూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి రాజకీయాలను తిరుపతి ఎన్నటికీ అంగీకరించదని, ఇలా వ్యవహరించే వారిని తిరుపతి తుడిచి పెట్టేసింది అని అన్నారు. చిత్తూరులో హత్యారాజకీయ సంప్రదాయంలో పెరిగిన కలుపు మొక్క ఆరణి శ్రీనివాసులు అంటూ ఘాటుగా విమర్శించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ప్రశాంతతకు నిలయమైన తిరుపతి లో అలజడులు సృష్టించేందుకు, గూండాగిరితో చేయాలని చూస్తున్న వ్యక్తి శ్రీనివాసులు అని, ఈ వ్యక్తి తిరుపతి లో అల్లర్లు లేకుండా చేస్తాడంట.. పవిత్రతను కాపాడుతాడంట.. శ్రీనివాసులు ఇంకా చాలా చాలా సుద్ధులు మాట్లాడం ఆపు అంటూ హెచ్చరించారు. తిరుపతిలో ఎవరూ దొరక్కపోతే, చిత్తూరు నుంచి రెండు వేల మంది రౌడీలను తీసుకొచ్చి దాదాగిరి చేయాలని చూస్తున్నాడు. ఆరణి శ్రీనివాసులు పత్రికల ద్వారా సుద్ధులు చెప్పడం కాదు.. తిరుపతి ప్రజలు చాలా మంచి వారు కాబట్టి ఓటుతో నీకు తగిన బుద్ధి చెబుతారు అంటూ హెచ్చరించారు. నీ బతుకే, నీ నేపథ్యమే హత్యా రాజకీయాల నేపథ్యం…నువ్వేంది, కాపాడేదేంది…? చిత్తూరులో ఉన్న సంస్కృతిని తిరపతికి తెస్తూ, మా అరాచకాన్ని ఆపుతానంటావా..? మేము చేస్తున్న మంచిని తుడిచేయాలని, మేము చేసే సేవలు ప్రజలకు అందకుండా చేయాలననే హింసా నేపథ్యంతో ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతున్నాడు అన్నారు. టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తిరుపతిలో‌ ఆదివారం ఉదయం ఎన్నికల ప్రచారం అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
Advertisements

You may also like

Our Visitor

019510
Total views : 90879

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.