Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Political హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీపై హాట్ కామెంట్స్

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీపై హాట్ కామెంట్స్

by Rama
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు. గత టీడీపీ హాయంలో ఆర్టీసీ బస్సులు వేస్తే, హిందూపురం డిపో నుండి పది బస్సులు చిత్తూరు జిల్లా పుంగనూరుకు తీసుకెళ్లారంటూ మాజీమంత్రి పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఘాటైన విమర్శ చేశారు. అభివృద్ధి జరగాలంటే ప్రధానంగా మెరుగైన రవాణా వ్యవస్థ ఉండాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారిపోయిందని బాలకృష్ణ విమర్శించారు. వైసీపీ చేసిన పాపాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను మానసిక క్షోభకు గురి చేశారని అన్నారు. అమాయకులను హత్యలు చేయించారని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వైసిపిపై ఆగ్రహించి కూటమిని గెలిపించారన్నారు. ఏపీలో అభివృద్దే లక్ష్యంగా కూటమి పని చేస్తుందని ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు. హిందూపురం టీడీపీ కార్యాలయంలో 64 కేజీల కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బాలకృష్ణకు టీడీపీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన.
    ఏపీ మంత్రి నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం మ‌లేషియా చేరుకున్న మంత్రి నారాయ‌ణ కు ఘన స్వాగతం లభించింది.కౌలాలంపూర్ లోని భార‌త హైక‌మిష‌న్ కార్యాల‌యంలో మంత్రికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. మంత్రి నారాయ‌ణ‌తో క్లాంగ్ ఎంపీ గ‌ణ‌ప‌తిరావు,మంత్రి…
  • ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్.
    ఏపీలో ప్రభుత్వ వైద్య సేవలను నిర్వీర్యం చేస్తున్న వైద్యులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఏళ్ల తరబడి అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 43 మంది డాక్టర్లను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్య సేవల్లో…
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.
    ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 18వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు కీలక రంగాలకు చెందిన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.అమరావతిలోని ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

025715
Total views : 147996

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.