హైదరాబాద్ నగరంలో నార్కోటిక్స్ బృందం ఒక గంజాయి వ్యాపారితోపాటు ఇద్దరు జూనియర్ డాక్టర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 80 గ్రాముల 10 గంజాయి పొట్లాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోటి మెడికల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. అరెస్టయిన వ్యక్తి ధూల్‌పేటకు చెందిన సురేష్ సింగ్ అలియాస్ టింకు సింగ్ గా పోలీసులు గుర్తించారు. ఇతని మీద గతంలో ధూల్‌పేట్, మంగళ్‌హాట్, టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్లలో ఐదు కేసుల్లో ఉన్నాయి. సురేశ్ కోటి వద్ద వైద్య విద్యార్థులకు గంజాయి సాచెట్స్ ను విక్రయించేందుకు యత్నించగా పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు డాక్టర్ కె మణికందన్, డాక్టర్ వి అరవింద్ లు గంజాయి సాచెట్స్ ను సురేష్ దగ్గర తీసుకోవడం జరిగింది. 2016 నుంచి ఎన్‌డీపీఎస్‌లో గంజాయి విక్రయిస్తున్నాడు సురేశ్. వైద్యులు ఇద్దరికీ గంజాయి మూత్ర పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. నిందితుల నుంచి దాదాపు ఎనిమిది నుంచి పది మంది వైద్య విద్యార్థులు గంజాయి కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. గత రెండేళ్లుగా సురేష్ జుమ్మెరాత్ బజార్‌కు చెందిన పంకజ్ సింగ్ నుంచి గంజాయిని కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు నలుగురు వైద్య విద్యార్థులను గుర్తించామని, డ్రగ్స్ సేవించిన ఇతర వైద్య విద్యార్థులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భూముల మార్కెట్ విలువల సవరణకు TG ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.తెలంగాణ ప్రభుత్వం భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల మార్కెట్ విలువల సవరణకు ఆమోదం తెలిపింది. కొత్త మార్కెట్ విలువలు ఈ నెల 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. క్షేత్రస్థాయి అధ్యయనం, మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ల ధోరణి, డిమాండ్ వంటి అంశాలను…
- ఇవాళ పాలమూరు పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి.ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు మరింత వేగం తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ, రేపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ పర్యటనలో పలు ఎత్తిపోతల పథకాలు,…
- మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో పాత కక్షల నేపథ్యంలో యువకుడిపై దాడి.మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్ లో పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై కొందరు బ్లేడ్‌తో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఇందిరానగర్‌కు చెందిన మంద సాయి కుమార్ తన స్నేహితులతో కలిసి ఓ వైన్స్‌లో మద్యం…
- గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చిందన్న టీఎన్ఎస్ఎఫ్.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ‘ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దుతోందని టీఎన్ఎస్ఎఫ్ పేర్కొంది . విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కూటమి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రౌండ్…
- నటి రమా నందన కుటుంబంపై ఇబ్రహీంపట్నంలో కేసు.ప్రముఖ యూట్యూబర్ మన శంకర వర ప్రసాద్, నటి రమా నందన అలియాస్ నందు కుటుంబంపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో మోసం కేసు నమోదైంది. యూకే వీసా రెన్యూవల్ చేస్తామంటూ డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట ఓ బాధితుడికి రూ. 15 లక్షల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 92164