Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై సీఎం స్పెషల్ ఫోకస్

రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై సీఎం స్పెషల్ ఫోకస్

by Rama

ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో లాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది. భూములు ఇచ్చేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై సీఎం స్పెషల్ ఫోకస్. భూములిచ్చేందుకు ముందుకొస్తున్న రైతుల నుంచి తీసుకోవాలని డిప్యుటీ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం లాండ్ పూలింగ్ ప్రక్రియను నిలిపివేసిన విషయం తెలిసిందే. భూసేకరణకు సంబంధించిన ప్రకటనను కూడా ఉపసంహరించుకుంది. ఇక రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా రాజధాని కోసం భూసేకరణ చేపట్టిన టీడీపీ ప్రభుత్వం అప్పట్లో 25,398 మంది రైతుల నుంచి 34,281 ఎకరాలను సమీకరించింది. మరో 4 వేల ఎకరాలను సేకరించాల్సి ఉండగా రైతులు తమ భూములిచ్చేందుకు నిరాకరించడంతో పూలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు, రాజధానిలో కార్యకలాపాలు ఊపందుకోవడంతో ప్రభుత్వ సిబ్బంది కొరత తలెత్తింది. దీంతో, ఇతర శాఖల నుంచి అధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్‌పై రాజధానికి తీసుకొచ్చేందుకు సీఆర్డీఏ కమిషనర్ ఓ ప్రకటనలో దరఖాస్తులను ఆహ్వానించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014718
Total views : 80936

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.