Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Latest News వైభవంగా సింహవాహిని అమ్మవారి బోనాలు

వైభవంగా సింహవాహిని అమ్మవారి బోనాలు

by Rama
వైభవంగా సింహవాహిని అమ్మవారి బోనాలు

హైదరాబాద్​లో బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. పాతబస్తీలోనివైభవంగా సింహవాహిని అమ్మవారి బోనాలు సంబురాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లాల్‌దర్వాజ సింహవాహినీ మహంకాళి మందిరంతోపాటు అక్కన్న మాదన్న ఆలయం, ఉమ్మడి దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వైభవంగా సింహవాహిని అమ్మవారి బోనాలు చారిత్రక లాల్‌దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అలయానికి పలువురు మంత్రులతో పాటు, వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా సింహవాహిని మహంకాళిని భక్తులు కొలుస్తారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారు. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అభిషేకాలు, కుంకుమార్చనలతో ఆలయాల్లో సందడి కొనసాగుతోంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014703
Total views : 80897

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.