Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Telangana ఫొటో షూట్ కోసమే బీజేపీ మూసీ నిద్ర

ఫొటో షూట్ కోసమే బీజేపీ మూసీ నిద్ర

by Rama
ఫొటో షూట్ కోసమే బీజేపీ మూసీ నిద్ర

తెలంగాణ బీజేపీ తలపెట్టిన మూసీ పరివాహక ప్రాంతాల పర్యటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. మూసీ ప్రాజెక్టు ఆపేందుకు బీజేపీ, BRS కుమ్మక్కై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిఫొటో షూట్ కోసమే బీజేపీ మూసీ నిద్ర చేశారని విమర్శించారు. బస చేసే ముందు ఆ ప్రాంతంలో దోమల మందు,ఈగల మందు కొట్టారని అన్నారు. మూడు నెలలు అక్కడ ఉంటే ప్రజల అవస్థలు తెలుస్తాయని చెప్పారు. మూసీ పక్కన మూడు నెలల బస చేయండి అని మా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారని గుర్తుచేశారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిన ప్రతీ సారి కిషన్ రెడ్డి బయటకి వస్తాడని ఎద్దేవా చేశారు. ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్‌ను ప్రొటెక్ట్ చేస్తారని కిషన్ రెడ్డిని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఒక్కరోజు నిద్ర చేసి ఏం సాధించారని ప్రశ్నించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019145
Total views : 89982

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.