Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాన ముప్పు ..

తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాన ముప్పు ..

by Rama
తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాన ముప్పు ..

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం ఈనెల 25నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈనెల 27వ తేదీ నుంచి మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తూర్పు హిందూ మహాసముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో రేపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ ఆ తర్వాత రెండు రోజుల్లో తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019218
Total views : 90110

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.