హైదరాబాద్ లో భారీ మోసం వెలుగుచూసింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై కేసు నమోదైంది. తృతీయ జ్యువెల్లరీ అధినేత కాంతి దత్ సెలబ్రిటీలను, సినిమా హీరోయిన్లు, వ్యాపారవేత్తలను టార్గెట్ చేసుకొని బురిడీ కొట్టిస్తున్నాడు. వ్యాపారంలో షేర్ ఇస్తానంటూ పరిణీతి చోప్రాకు టోకరా ఇచ్చాడు. ఇక పరిణీతి చోప్రా తన జ్యువెల్లరీకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ శ్రీజ రెడ్డి అనే మహిళా వ్యపారవేత్తను సైతం నిండా ముంచాడు. ఫోర్జరీ సంతకాలతో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది. కాంతి దత్ బాధితుల్లో హీరోయిన్ సమంత, కీర్తి సురేష్ లు సైతం ఉన్నట్లు సమాచారం. శ్రీజ రెడ్డి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కాంతి దత్ పై కేసు నమోదు చేశారు. కాంతి దత్ 100 కోట్లకు పైగా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కాంతి దత్ మీద సీసీఎస్ లో కేసులు ఉన్నాయి. బాధితులు మరింత పెరిగే అవకాశం ఉంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రామాలయంలో అఖండ దీపం.700 ఏళ్లుగా అఖండంగా వెలుగుతున్న దీపం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న ఈ దీపాన్ని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. సీనియర్ సినీ నటులు, దర్శకుడు, న్యాయవాది సివిఎల్…
- అమరావతిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ.. అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన మంత్రి, అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.రాజధాని కోసం భూములు ఇచ్చిన ప్రతి రైతుకూ ప్లాట్లు…
- మంత్రి నారాయణతో భేటీ అయిన సీఆర్‌ఆర్‌ఐ ప్రతినిధులు.మంత్రి నారాయణతో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో ఎల్పీఎస్ జోన్లు నిర్మిస్తున్న సీఆర్‌ఆర్‌ఐ రోడ్లను స్టడీ చేస్తున్నారు. రెండ్రోజులపాటు జోన్లలో ఇంటర్నల్ రోడ్లు, డ్రెయిన్లు, పవర్ లైన్లు అధ్యయనం చేశారు. ఎల్పీఎస్ జోన్-2, 5, 9,…
- మాజీ సీఎం జగన్ పై హోం మంత్రి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే.. జగన్ 9 నెలల తర్వాత విషప్రచారం మొదలుపెట్టారంటూ వ్యాఖ్యానించారు. గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే…
- జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన రచనను ఆ పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో.. ‘ ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో..ప్రాణాల్ని ఆటబంతుల్లా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 92161