తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫారసు లేఖలపై ఇచ్చే టికెట్లను టిటీడీ నిశితంగా పరిశీలిస్తోంది. దుర్వినియోగానికి పాల్పడుతున్నవారిపై నిఘా పెట్టింది. సిఫారసు లేఖల్ని ఇష్టానుసారం వినియోగించడంలో అధికార, ప్రతిపక్షాలనే తేడా లేకుండా ఉందని అధికారులు గుర్తించారు. దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో ఒకరిద్దరు మంత్రులూ ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించి ఆయన ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
వైసీపీ హయాంలో వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శనాల్లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు సెల్ఫ్ సిఫారసు లేఖలను టీటీడీ సమర్పించి… తమవెంట 50 నుంచి 100 మందిని తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. దీనిని కట్టడి చేస్తే… శ్రీవారిని దర్శించుకునేందుకు సామాన్యభక్తులకు అదనంగా మరో గంట సమయాన్ని అందుబాటులోకి తేవొచ్చని టీటీడీ భావిస్తోంది.
మరోవైపు ప్రతినెలా ఖాళీగా ఉన్న ఆర్జిత సేవల టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసి డిప్ ద్వారా టీటీడీ కేటాయిస్తుంది. ఒక్కసారి ఆర్జితసేవ టికెట్ పొందిన భక్తుడికి మళ్లీ మూడు నెలల తర్వాతే దర్శనానికి అవకాశం ఉంటుంది. ఇలా సామాన్య భక్తులకు ఒక రీతి… వీఐపీలకు మరో రీతి ఉండటంపై భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి