Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Andhra Pradesh అమరావతి రాజధాని ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం.

అమరావతి రాజధాని ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం.

by CVR NEWS

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మరో అగ్నిప్రమాదం జరిగింది. రాయపూడి సమీపంలో రాజధాని నిర్మాణ పనుల కోసం నిల్వ చేసిన పైపులకు నిప్పంటుకొని ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రిన్సిపల్ సెక్రటరీస్ భవనాల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మేఘా కంపెనీకి చెందిన ప్లాస్టిక్ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది..వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దట్టమైన పొగతో మంటలు ఎగసిపడటంతో అదుపు చేయటం చాలా సేపటివరకు కష్టంగా మారింది. ఇదిలా ఉంటే..కొద్దిరోజుల క్రితం వెలగపూడి సమీపంలో ఎల్‌అండ్‌టీకి చెందిన కోట్ల రూపాయల విలువైన పైపులు దగ్ధమయ్యాయి. ఆ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. అది మరువక ముందే తాజాగా మరో ప్రమాదం జరిగింది. ఇలా వరుస ఘటనలతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిప్రమాదాల వెనుక కుట్ర కోణముందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: