Thursday, October 15, 2026
News Navigation
Thursday, October 15, 2026
News Navigation

Breaking

Thursday, October 15, 2026
Home Andhra Pradesh అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..

by CVR NEWS
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో అమాయక ప్రజలను మభ్యపెడుతూ.. వీఎంఆర్‌డీఏ, పంచాయతీ అనుమతులు లేని అక్రమ లేఅవుట్లతో కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారు. పెదరాంబద్రపురం, నామవరం పరిధిలోని పలు సర్వే నంబర్లలో కనీస వసతులు లేకుండానే ప్లాట్లు అమ్ముతున్నారు. తీరా ఇల్లు కట్టుకునే సమయంలో అప్రూవల్స్ పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ కొనుగోలుదారులను ముంచుతున్నారు. అధికార పార్టీ అండదండలతోనే ఈ అక్రమ దందా సాగుతోందని, కోర్టు తీర్పులు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. సామాన్యుల సొమ్మును దోచుకుంటున్న ఈ రియల్ ఎస్టేట్ తిమింగలాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు జరిపి, అక్రమ లేఅవుట్లను సీజ్ చేయాలని మరియు బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: