Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home International గాజాలో హమాస్ చీఫ్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి..

గాజాలో హమాస్ చీఫ్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి..

by CVR NEWS
గాజాలో హమాస్ చీఫ్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి

గాజా ప్రాంతంలో హమాస్ కీలక నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ భారీ వైమానిక దాడి నిర్వహించింది. హమాస్ మిలిటరీ విభాగానికి ఇటీవలే చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ ఒడెహ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది.ఈ దాడిలో ఒడెహ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల్లో ఒడెహ్ కీలక పాత్ర పోషించినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఆ సమయంలో హమాస్ ఇంటెలిజెన్స్ విభాగానికి నాయకత్వం వహించిన ఒడెహ్… ఇజ్రాయెల్ సరిహద్దు బలహీనతలపై సమాచారాన్ని సేకరించి దాడి వ్యూహరచనలో కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొంది.ఒడెహ్ మరణాన్ని ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి కట్జ్ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. కాగా, కొద్ది రోజుల క్రితం హమాస్ మిలిటరీ చీఫ్ ఎజ్జెదిన్ అల్ హద్దాద్‌ను కూడా ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఒడెహ్.. కేవలం 11 రోజుల్లోనే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018663
Total views : 89125

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.