Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ -మంత్రి పొంగులేటి..

రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ -మంత్రి పొంగులేటి..

by CVR NEWS
ఫ్యూచర్ సిటీ పనులు పరిశీలించిన పొంగులేటి, శ్రీధర్‌బాబు

రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపడతామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. జూన్‌ చివరి నాటికి మరో లక్ష పూర్తవుతాయన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 18వేల ఇళ్లు మంజూరు చేశామని మంత్రి వివరించారు. తొలిదశలో హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి అవసరమైన కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లామన్నారు. 13 చోట్ల స్థలాలు పరిశీలించామని మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీలో స్థలం కొరతతో 18వేల ఇళ్లే ఇచ్చామని, పేదల ఇళ్ల కోసం విలువైన ప్రభుత్వ భూములను కేటాయిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. జీవనోపాధికి అనుగుణంగా ఉండే ప్రాంతాల్లో, నివాసయోగ్యమైన ప్రదేశాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. జీహెచ్ఎంసీ ప్రాంతంలో తమ ప్రభుత్వం బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, చెప్పినట్లు తాము ఎక్కువ ఇండ్లు కట్టి చూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు కేటీఆర్ సిద్ధమా అని మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019084
Total views : 89883

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.