Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Latest News ప్రజ్ఞానందతో చెస్ ఆడిన సీఎం సి. జోసెఫ్ విజయ్.

ప్రజ్ఞానందతో చెస్ ఆడిన సీఎం సి. జోసెఫ్ విజయ్.

by CVR NEWS
ప్రజ్ఞానందతో చెస్ ఆడిన సీఎం సి. జోసెఫ్ విజయ్

ప్రపంచ చెస్ వేదికపై భారత కీర్తిని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందకు తమిళనాడు ప్రభుత్వం ఘన సన్మానం నిర్వహించింది. నార్వే చెస్ 2026 సిరీస్‌లో విజేతగా నిలిచిన ప్రజ్ఞానంద, ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రజ్ఞానందను అభినందించి సత్కరించారు. అనంతరం ప్రజ్ఞానందతో సరదాగా చెస్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించారు.ప్రజ్ఞానంద సాధించిన విజయం దేశ యువతకు స్ఫూర్తిదాయకమని సీఎం విజయ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి గౌరవం తీసుకొచ్చిన ప్రజ్ఞానంద భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయనకు 50 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని అందజేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

023419
Total views : 141973

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.