Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

by CVR NEWS
అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి చెందిన ప్రముఖులు సత్తా చాటారు. అమెరికాలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారుల జాబితాలో ఏకంగా 27 మంది భారతీయ మూలాల వ్యక్తులు చోటు దక్కించుకోవడం విశేషం. వలసదారులపై కఠిన చర్యలు, గ్రీన్‌కార్డు నిబంధనల కట్టుదిట్టం వంటి పరిణామాల మధ్య విడుదలైన ఈ జాబితా ప్రాధాన్యత సంతరించుకుంది. ఫోర్బ్స్‌ జాబితాలో సన్‌మైక్రోసిస్టమ్స్‌ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్‌ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ వినోద్‌ ఖోస్లా 14వ స్థానంలో నిలిచారు. ఏంజెల్‌లిస్ట్‌ సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఇన్వెస్టర్‌ నావల్‌ రవికాంత్‌ 27వ స్థానాన్ని దక్కించుకున్నారు. జనరల్‌ క్యాటలిస్ట్‌ వ్యవస్థాపకుడు హేమంత్‌ తనేజా 31వ స్థానంలో, మైక్రాన్‌ సీఈవో సంజయ్‌ మెహ్రోత్రా 44వ స్థానంలో నిలిచారు. అలాగే గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ 55వ స్థానంలో, టాప్‌ చెఫ్‌ హోస్ట్‌ పద్మ లక్ష్మీ 64వ స్థానంలో చోటు సంపాదించారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల 89వ స్థానంలో, ఐబీఎం సీఈవో అరవింద్‌ కృష్ణ 219వ స్థానంలో, అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌ 221వ స్థానంలో నిలిచారు. పెప్సీకో మాజీ సీఈవో, మాజీ చైర్‌పర్సన్‌ ఇంద్రా నూయి 248వ స్థానంలో నిలిచారు.మొత్తంగా 250 మంది విజయవంతమైన వలసదారుల జాబితాలో 27 మంది భారత సంతతి ప్రముఖులకు స్థానం దక్కడం భారతీయుల ప్రతిభకు మరో గుర్తింపుగా నిలిచింది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

023232
Total views : 141614

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.