Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh పాపికొండల విహారయాత్రలకు బ్రేక్.

పాపికొండల విహారయాత్రలకు బ్రేక్.

by CVR NEWS
పాపికొండల విహారయాత్రలకు బ్రేక్

పాపికొండల విహారయాత్రకు బ్రేక్‌ పడింది. గోదావరిలో పర్యాటక బోట్ల నిర్వహణపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా పాపికొండలకు వెళ్లే పర్యాటక బోట్ల రాకపోకలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు రంపచోడవరం RDO. పాపికొండల విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల దేవీపట్నం మండలం గండిపోచమ్మ అమ్మవారి ఆలయం నుంచి ఓ బోటులో దాదాపు 89 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. దేవీపట్నం పాత పోలీసుస్టేషన్‌ ప్రాంతానికి వెళ్లేసరికి సాంకేతిక లోపం ఏర్పడటంతో అప్రమత్తమైన డ్రైవర్‌ బోటును నిలిపివేశారు. దీంతో భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు బోట్ల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలపై పరిశీలన చేయిస్తున్నారు. వీటిపై నివేదిక వచ్చాకే.. బోట్లకు అనుమతులు ఇస్తామని ఆర్డీవో తెలిపారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: