Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Latest News యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ 2026 ఫలితాలు విడుదల.

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ 2026 ఫలితాలు విడుదల.

by CVR NEWS
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ 2026 ఫలితాలు విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 13వేల 343 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది మే 24న దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. మొత్తం ఒక వెయ్యి పదహారు సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, మెయిన్స్‌కు ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు. మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా జూన్ 19 నుంచి 28 మధ్య యూపీఎస్సీ పోర్టల్‌లో లాగిన్ అయి డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే 200 రూపాయల పరీక్ష ఫీజును చెల్లించాలి. అయితే, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, ఆన్సర్ కీలను సివిల్ సర్వీసెస్ 2026 తుది ఫలితాలు వెలువడిన తర్వాతే ప్రకటిస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఏవైనా సందేహాలుంటే యూపీఎస్సీ కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చని సూచించింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: