Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Andhra Pradesh అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

by CVR NEWS
అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం

అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. నగరంలోని నడిమివంకపై ఉన్న ఆక్రమణల తొలగింపు పనులను మున్సిపల్ కమిషనర్ జస్వంత్ కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. గతంలో జరిగిన నిర్లక్ష్యంతో వంకలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వర్షాకాలంలో నీటి ప్రవాహం నిలిచిపోయి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆక్రమణలను పూర్తిగా తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. నగరంలో ఎక్కడ ఆక్రమణలు ఉన్నా ఉపేక్షించబోమని, భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలందరూ సహకరించాలని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమిదేనని ఆయన పేర్కొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: