Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Film విజయవంతంగా రెండో వారంలోకి ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం.

విజయవంతంగా రెండో వారంలోకి ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం.

by CVR NEWS
విజయవంతంగా రెండో వారంలోకి ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం.

హారర్ థ్రిల్లర్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు. ‘అఘోర’, ‘పౌరుషం’, ‘ఆప్త’, ‘దండు’, ‘రాఘవరెడ్డి’, ‘ఆదిపర్వం’ వంటి చిత్రాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన సంజీవ్ మేగోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

వివాదాల నడుమ విడుదలైన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం అన్ని కేంద్రాల్లో రెండో వారంలోనూ విజయవంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతోంద‌ని చిత్ర‌యూనిట్ అనందం వ్య‌క్తం చేసింది. ప్రేక్షకుల ఆదరణతో పలు ప్రాంతాల్లో థియేటర్ల సంఖ్యను కూడా పెంచినట్లు నిర్మాత బాలకృష్ణ మహారాణా తెలిపారు. ముఖ్యంగా దివంగత సూపర్ స్టార్ కృష్ణపై ప్రత్యేకంగా రూపొందించిన స్పెషల్ సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు.

‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే విభిన్న కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించామని దర్శకుడు సంజీవ్ మేగోటి తెలిపారు. ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని కొత్త అనుభూతిని అందించేలా కథను మలిచామని, పాత్రల రూపకల్పన కూడా ప్రత్యేకంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా అలరిస్తోందని ఆయన అన్నారు.

యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, కృతివర్మ, ప్రీతీ సుందర్, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్, సత్తెన్న, విజయభాస్కర్, మధు నంబియార్, అనిల్ రాజ్, శ్రీహర్ష, దేవేందర్, పుష్పారామ్, డీఎస్పీ తదితరులు నటించారు. దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులు నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్–రవితేజ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయని చిత్ర బృందం తెలిపింది.

విభిన్నమైన కథా నేపథ్యం, బలమైన నటీనటుల సమాహారం, థ్రిల్లింగ్ అంశాలు ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని దర్శకుడు సంజీవ్ మేగోటి పేర్కొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: