Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home International బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా.

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా.

by CVR NEWS
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా

బ్రిటన్‌లో మరోసారి రాజకీయ అస్థిరత నెలకొంది. ఆ దేశ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తన పదవికి రాజీనామా చేశారు. లేబర్ పార్టీ ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. పదవిలో ఉన్నంత కాలం విలువలకు కట్టుబడి పని చేసినట్లు తెలిపారు. తాజా పరిణామంతో బ్రిటన్‌లో దశాబ్ద కాలంలో తమ పదవులకు రాజీనామా చేసిన ప్రధానుల సంఖ్య ఆరుకి చేరింది.

కీర్‌ స్టార్మర్‌ 2024లో బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ పేలవమైన ప్రదర్శన మాత్రమే ఇవ్వడం, మేకర్‌ఫీల్డ్‌ పార్లమెంటరీ ఉపఎన్నికలో బర్న్‌హామ్ ఘన విజయం సాధించడంతో స్టార్మర్‌ నాయకత్వంపై ప్రశ్నలు వస్తున్నాయి. ఎప్‌స్టీన్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన స్నేహితుడు పీటర్ మాండెల్సన్‌ను అమెరికాలో యూకే రాయబారిగా నియమించాలనే స్టార్మర్‌ నిర్ణయంపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాను ప్రధాని పదవి నుంచి వైదొలగాలని సహచర మంత్రులతోపాటు సొంత పార్టీ ఎంపీల నుంచి ఆయనపై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ తాను పదవి నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని వాదిస్తూ వచ్చిన స్టార్మర్‌.. తాజాగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: