Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Latest News రాష్ట్రపతితో ప్రధాని భేటీ.

రాష్ట్రపతితో ప్రధాని భేటీ.

by CVR NEWS
రాష్ట్రపతితో ప్రధాని భేటీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ఈ రోజు సాయంత్రం ఈ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రివర్గం పునర్‌వ్యస్థీకరణ ఊహాగానాల వేళ ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేరళకు చెందిన భాజపా నేత జార్జ్‌ కురియన్‌ కేంద్ర సహాయ మంత్రి పదవికి ఈ ఉదయం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ పరిణామంతో కేంద్రమంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ తథ్యమన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికితోడు ఇటీవల పలువురు కేంద్రమంత్రులకు వారి వారి రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలను అప్పగించడం దీనికి మరింత బలం చేకూరింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా ఉన్న హర్ష్‌ మల్హోత్రాను దిల్లీ భాజపా అధ్యక్షుడిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ మే నెలలో నియమించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: