Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra Pradesh పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం.

పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం.

by CVR NEWS
పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం

కులమతాల మధ్య చిచ్చుపెట్టడం గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్‌ DNAలోనే ఉందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు విమర్శించారు. కాకినాడలో ఆయన మాట్లాడారు. కాపు సమాజం పేరుతో సమావేశాలు నిర్వహించి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శ చేయడం వైసిపి నాయకుల రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శమని అన్నారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాపు యువతకు ఉపాధి, కాపు కళ్యాణ మండపం నిర్మాణ విషయంలో వైసిపి పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు అసత్య ప్రచారాలు మానుకుని ప్రజా సమస్యలపై మాట్లాడాలని, కాపు సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకుగా వైసిపి చూడడం జరుగుతుందన్నారు. హైదరాబాద్‌ సుభిక్షంగా ఉన్నప్పుడు మతాల మధ్య చిచ్చుపెట్టిన ఘనత జగన్‌ తండ్రిదని అదే ఆనవాయితీని జగన్‌ కొనసాగిస్తున్నారని, రాష్ట్రంలో ఏ ఘటన చోటుచేసుకున్నా దానికి కులం రంగు పులిమేందుకు జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. డాక్టర్‌ సుధాకర్‌, అమర్నాథ్‌ గౌడ్‌, చంద్రయ్యను నిర్దాక్షణ్యంగా పొట్టన పెట్టుకున్నప్పుడు వారికి కులాలు గుర్తుకు రాలేదా అని తుమ్మల బాబు ప్రశ్నించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: