Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Andhra Pradesh నేటి నుంచి మంగళగిరిలో APL సీజన్-5.

నేటి నుంచి మంగళగిరిలో APL సీజన్-5.

by CVR NEWS
నేటి నుంచి మంగళగిరిలో APL సీజన్-5

ఏపీలో క్రికెట్ అభిమానులను అలరించేందుకు మంగళగిరి క్రికెట్ స్టేడియంలో నేటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.టోర్నమెంట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. తొలి రోజు మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రముఖ సినీ నటుడు రామ్‌ చరణ్, మంత్రి నారా లోకేష్‌ తదితర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు.స్టేడియం సామర్థ్యం 26 వేల మంది అయినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా 10 వేల నుంచి 15 వేల మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.టోర్నీలో క్యాపిటల్ అమరావతి, కాకినాడ కింగ్స్, విజయవాడ సన్ షైనర్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్, భీమవరం, రాయలసీమ జట్లు పాల్గొని టైటిల్ కోసం పోటీపడనున్నాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: