Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.

నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.

by CVR NEWS
నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ఒకప్పుడు బంగారు గని అనగానే కర్ణాటకలోని కేజీఎఫ్ మాత్రమే గుర్తుకొచ్చేది. ఇప్పుడు ఆ చరిత్ర మారనుంది. రాయలసీమలోని కర్నూలు జిల్లా జొన్నగిరి, దేశ పసిడి పటంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోనుంది. కరవు నేలగా పేరున్న ఈ ప్రాంతం, ఇప్పుడు బంగారం ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందనుంది. దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ఇక్కడ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నెలకొల్పాయి. 405 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ బంగారం శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేశాయి. ఇందుకోసం ప్రభుత్వం 1,500 ఎకరాల భూమిని కేటాయించగా, మొదటి దశలో 600 ఎకరాల్లో తవ్వకాలు, ప్రాసెసింగ్ పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ ప్లాంట్‌లో.. ప్రారంభోత్సవం అనంతరం పూర్తిస్థాయి ఉత్పత్తి మొదలవుతుంది. ఈ సందర్భంగా ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌కు కూడా సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: