Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home International 108 అంతస్తుల బిల్డింగ్‌ను ఢీకొట్టిన స్మాల్‌ ప్లేన్.

108 అంతస్తుల బిల్డింగ్‌ను ఢీకొట్టిన స్మాల్‌ ప్లేన్.

by CVR NEWS
108 అంతస్తుల బిల్డింగ్‌ను ఢీకొట్టిన స్మాల్‌ ప్లేన్

చైనా రాజధాని బీజింగ్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఒక స్మాల్‌ ప్లేన్‌ 108 అంతస్తుల అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యం ‘చైనా జున్’ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన ధాటికి భవనం పై అంతస్తుల నుంచి శిథిలాలు, విమాన భాగాలు కింద ఉన్న రోడ్లపై చెల్లాచెదురుగా పడ్డాయి. దేశీయంగా తయారైన ఒక చిన్న విమానం ఈ మేరకు ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బంది, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో ముందు జాగ్రత్తగా భవనంలోని పలు అంతస్తుల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భవనం సమీపంలో విమాన శకలాలు పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అత్యంత ఎత్తైన భవనాన్ని విమానం ఢీకొట్టిన ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: