Thursday, October 15, 2026
News Navigation
Thursday, October 15, 2026
News Navigation

Breaking

Thursday, October 15, 2026
Home Latest News TRP రేటింగ్స్‌ను నిలిపివేస్తూ MIB కీలక నిర్ణయం.

TRP రేటింగ్స్‌ను నిలిపివేస్తూ MIB కీలక నిర్ణయం.

by CVR NEWS
TRP రేటింగ్స్‌ను నిలిపివేస్తూ MIB కీలక నిర్ణయం

దేశంలోని టెలివిజన్ ఛానళ్లకు అత్యంత కీలకమైన TRP రేటింగ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేటింగ్‌ పాయింట్స్‌ విధానం అమల్లోకి వచ్చే వరకు… BARC విడుదల చేసే టీవీ రేటింగ్స్‌ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిలిపివేసింది. దీంతో న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సహా అన్ని టీవీ ఛానళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రతి వారం విడుదలయ్యే టీఆర్పీ రేటింగ్స్ ఆధారంగా ప్రకటనల మార్కెట్, ఛానళ్ల ఆదాయం, ప్రోగ్రామింగ్ వ్యూహాలను నిర్ణయిస్తారు. అయితే, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కొత్త పాలసీ తీసుకొస్తోంది. టీవీ రేటింగ్‌ వ్యవస్థలో మరింత పారదర్శకత, శాంపిల్‌ తీసుకునే ఇళ్ల సంఖ్య పెంపు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వడం రేటింగ్‌లో మానిప్యులేషన్‌కు అడ్డుకట్ట వేయడం.. కొత్త విధానంలో కీలక అంశాలుగా ఉన్నాయి. ఈ విధానంలోకి అన్ని ఛానళ్లు మారే వరకు ప్రస్తుత రేటింగ్ విధానాన్ని నిలిపివేయాలని MIB నిర్ణయించింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: