ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్య సేవల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి నూతన సదరం శిబిరం, యూడీఐడీ భవనం, ఆక్సిజన్ ప్లాంట్‌తో పాటు అర్థో, గైనకాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ విభాగాలకు సంబంధించిన నాలుగు ఆధునిక ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించామని మంత్రి సీతక్క తెలిపారు. త్వరలో జిల్లా కేంద్రంలో ప్రత్యేక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని, జిల్లా ఆసుపత్రిపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని మరో ఆసుపత్రి ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
ములుగు జిల్లా ఆసుపత్రిలో నూతన వైద్య సదుపాయాల ప్రారంభం.
207
previous post